ఫోలిక్ ఆమ్లం/ఫోలాసిస్ (విటమిన్-బి9)
- ఈ ఆమ్లం మొదట ‘స్పినాక్ ఆకుల’ నుంచి లభ్యమయింది. (ఫోలియం= పత్రం)
- దీనిని కృత్రిమ సంయోగ క్రియ ద్వారా చేసినది: ఎల్లాప్రగడ సుబ్బారావు.
- ఈ విటమిన్‌ను M- Vitamin అని కూడా అంటారు.
- ఈ విటమిన్ కోలీన్, సీరైన్ల సంశ్లేషణలో పాల్గొంటుంది.
- న్యూక్లిక్ ఆమ్లాల ( DNA, RNA ) సంశ్లేషణకు అవసరం.
- లభ్యతలు: మొక్కజొన్న, గోధుమ, మొలకెత్తిన గింజలు మొదలైనవి
- లోప రుగ్మతలు: RBC ఉత్పాదక ప్రక్రియ కుంటుపడి రక్తహీనతకు దారితీస్తుంది. మానసిక రుగ్మతలు, మూర్ఛవ్యాధి, ల్యూకోపినియా మొదలైనవి.
B12
- దీన్ని ‘యాంటీ పెర్నియాసిస్ ఎనీమియా విటమిన్’ అంటారు.
- ఇది నీలిరంగులో ఉంటూ ‘కోబాల్ట్’ (Co ) అనే లోహ మూలకాన్ని కలిగిన విటమిన్.
- కార్బోహైడ్రేట్స్ కొవ్వుల జీవక్రియలో సహకరిస్తుంది.
- యాంటీబాడీల ఉత్తత్తికి సహకరిస్తుంది.
- కేంద్రకామ్లాలు,RBC, WBC సంశ్లేషణలో పాల్గొంటుంది.
- నాడీకణ మైలిన్ తొడుగు ఉత్పత్తికి సహాయపడుతుంది.
- లభ్యతలు: కోడిమాంసం, కాలేయం, పాలు, గుడ్డు మొదలైనవి.
- లోప రుగ్మతలు: మాక్రోసైటిక్ అనీమియా, పెర్నిసియాస్ అనీమియా అనే రక్తహీనతలు కలుగుతాయి. బాలింత స్త్రీలల్లో పాల ఉత్పత్తి కుంటుపడుతుంది.
విటమిన్-సి (Vitamin -C)
- రసాయన నామ: ఆస్కార్బిక్ ఆమ్లం
- వాడుక నామం: యాంటీ స్కర్వీ విటమిన్ (Slimness Vitamin )
- ఇది రంగులేని విటమిన్. క్షార మాధ్యమంలో సులువుగా కరుగుతుంది.
- ఇది తాజా పండ్లలో ఉంటుంది.
- ఇది ‘ఉసిరి’లో ఎక్కువగా ఉంటుంది.
- లభించే పదార్థాలు: సిట్రస్ జాతి ఫలాలు, జామ, మామిడి, టమాటో మొదలైనవి.
ఉపయోగాలు - గాయాలు త్వరగా మానడానికి రోగ నిరోధక శక్తి పెంచేందుకు విరిగిన ఎముకలు అతికేందుకు యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
- లోపరుగ్మతలు : స్కర్వీ: చిగుళ్లు స్పంజిక లాగా ఉబ్బి రక్తస్రావం జరుగుతుంది. స్కర్వీ వ్యాధిని ‘సెయిలర్స్ డిసీజ్’ అని కూడా అంటారు.
రోగనిరోధక శక్తి తగ్గడం, గాయాలు మానకపోవడం.
గాలి సోకినా, వెలుతురు సోకినా నశించే విటమిన్-ఎ
వేడిచేస్తే నశించే విటమిన్: A, D
సల్ఫర్ (S) కలిగిన విటమిన్: B1, B7
పచ్చిగుడ్లు తాగడం ద్వారా శరీరం కోల్పోయే విటమిన్: బయోటిన్ (B7)
E.Coil సంశ్లేషణ చేసే విటమిన్: B12, K
క్యాన్సర్ నిరోధక విటమిన్లు: A, C, E
హైపర్ విటమినోసిస్ (అతి విటమినీయ స్థితి)
శరీరంలో విటమిన్లు మితిమీరి చేరితే విశిష్ట రోగ లక్షణాలు చూపుతుంది. ఈ స్థితిని అతి విటమీనియ స్థితి అంటారు.
ఉదా: విటమిన్-సి ఎక్కువయితే గౌట్ వ్యాధి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం.
విటమిన్-D ఎక్కువయితే మృదుకణజాలం అస్థీకరణ చెందడం జరుగుతుంది.
గుడ్డు :
- గుడ్డును ‘సంతులిత ఆహారం’ (బ్యాలెన్స్డ్ ఫుడ్)గా పరిగణిస్తారు.
- గుడ్డు అత్యధిక జీవశాస్త్రీయ విలువ, ‘ప్రొటీన్ ఎఫిషియన్సీ నిష్పత్తి’ కలిగి ఉంటుంది.
- గుడ్డులో అత్యధికంగా లభ్యమయ్యే విటమిన్లు: A, D, B2 ( రెబోఫ్లేవిన్ )
- 100 గ్రాముల గుడ్డులో ఉండే పోషక విలువలు
- ప్రొటీన్లు – 13.3%
- కొవ్వులు- 13.3%
- కాల్షియం- 27 మిల్లిగ్రాములు
- పాస్ఫరస్- 102 మిల్లిగ్రాములు
- శక్తి – 173 కేలరీలు
- గుడ్డు తెల్ల సొనలో అల్బుమిన్ అనే ప్రొటీన్‌తో పాటు అనేక పోషకాలు ఉంటాయి.
- పచ్చసొనలో కొలెస్టెరాలు ఉంటుంది.
- గుడ్ల ఉత్పత్తికి చేపట్టిన విప్లవం: సిల్వర్ రెవల్యూషన్
- సమీకృత ఆహారం (Balanced Food)
- శరీర అభివృద్ధికి, నిర్మాణానికి, శక్తికి కావాల్సిన అన్ని పోషక పదార్థాలైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి కావల్సిన సమపాళ్లలో లభ్యమయ్యే ఆహారాన్ని ‘సంతులిత ఆహారం’ అంటారు.
ఉదా: పాలు, గుడ్డు
పాలు:
- పాలను ‘కొవ్వు విస్తరించి ఉన్న నీరు’ అంటారు. దీన్నే ఇమల్షన్ అంటారు.
- పాలలో ప్రొటీన్స్, కార్బొహైడ్రేట్స్‌తో పాటు Ca, K, Fe ఉంటాయి.
- ఆవు పాలలో అధికంగా ఉండే విటమిన్లు: B, A
- ఆవు పాలలో పసుపు రంగుకు కారణం: రెబో ఫ్ల్లేవిన్ (Vitamin-B12 )
- బర్రె పాలలో కొవ్వు శాతం: 7.2%
- పాలు పుల్లగా మారినపుడు ఉత్పత్తి అయ్యే ఆమ్లం: లాక్టిక్ ఆమ్లం
- పాలు కిణ్వ ప్రక్రియలో పెరుగుగా మారేందుకు తోడ్పడేవి: లాక్టో బాసిల్లన్, ఈస్ట్
- పాలను సూక్ష్మజీవి రహితం చేసేందుకు వాడే పద్ధతి: ‘పాశ్చరైజేషన్’.
- దీన్ని కనుగొన్నది: లూయీ పాశ్చర్
- పాశ్చరైజేషన్ అనగా: పాలను 72oC వేడిచేసి 15 సెకన్ల వరకు నిల్వ ఉంచడం (లేదా) 65 డిగ్రీల సెంటిగ్రేడ్ 30 నిమిషాల వరకు ఉంచడం.
- పాలలోని సూక్ష్మజీవుల (బ్యాక్టీరియాల) సంఖ్యను కనుక్కోవడానికి ఉపయోగించే పరీక్ష: మెథిలిన్ బ్లూ క్షయకరణ పరీక్ష, ప్లేట్ కౌంట్ పద్ధతి.
- పాలలోని చక్కెర – లాక్టోజ్
- పాలలోని ప్రొటీన్ – కెసిన్
- పాలలోని కొవ్వు – లాక్టిక్ ఆమ్లం
- పాలలోని ఎంజైమ్ – లాక్టేజ్
- పాలలోని నీటిశాతాన్ని పరీక్షించేది- లాక్టోమీటర్
- పాలలోని కొవ్వుశాతం ఎండకాలంలో తక్కువగాను, మిగిలిన కాలాల్లో ఎక్కువగాను ఉంటుంది.
- చిన్నపిల్లల్లో పాలనుగడ్డ కట్టించే ఎంజైమ్- రెనిన్
- శ్వేతవిప్లవం (వైట్ రివెల్యూషన్): పాలు, పాల ఉత్పత్తుల దిగుబడిని పెంచేందుకు చేపట్టిన విప్లవం. దీనిలో భాగంగా ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమం నిర్వహించారు.
- ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్: వర్గీస్ కురియన్ (2011లో మరణించారు) ఇతను గుజరాత్ (ఆనంద్ పట్టణం)లో డెయిరీ స్థాపించిన సభ్యులు. అమూల్ మిల్క్ ఫ్యాక్టరీ
నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB)
ICMR (Indian Councils of Medical Research)ప్రకారం శరీరానికి కావల్సిన పరిమాణం:
అపరాలు (ధాన్యాలు)- 420 గ్రాములు
పప్పుదినుసులు – 70 గ్రాములు
ఆకుపచ్చ కూరలు – 250 గ్రాములు
పండ్లు – 100 గ్రాములు
పాలు – 400 మిల్లీలీటర్లు
మాంసం/ చేపలు, గుడ్లు – 80 గ్రాములు
చక్కెర/బెల్లం 30 గ్రాములు
పోషకాహార లోపం (Malnutrition ): తగినంత మొత్తాల్లో కావల్సిన పోషకాలు లోపించిన ఆహారం తీసుకోవడాన్ని ‘పోషకాహార లోపం’ అంటారు.
పిల్లల్లో పోషకాహార లోపం- రుగ్మతలు
3 రకాలు
కేలరీ పోషకాహార లోపం: కార్బోహైడ్రేట్స్, కొవ్వులు లోపించిన ఆహారం తీసుకోవడం ద్వారా
ప్రొటీన్ పోషకాహార లోపం: ప్రొటీన్ లోపం
ప్రొటీన్-కేలరీ పోషకాహార లోపం: ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, కొవ్వులు లోపం
క్వాషియోర్కర్
దీన్నే ‘నిర్లక్ష్యం చేసిన శిశువు’ అంటారు.
ప్రొటీన్ లోపం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది.
తల్లిపాలు పిల్లలకు అందకపోవడం వల్ల వస్తుంది.
ఈ వ్యాధిలో పిల్లలు తరుచూ అతిసార వ్యాధితో బాధపడుతారు. పెరుగుదల క్షీణిస్తుంది.
మెరాస్మస్
ఈ వ్యాధి ప్రొటీన్లు + కేలరీల లోపం వల్ల వస్తుంది.
పిల్లలు వయస్సులో ఉండాల్సిన బరువులో 60% మాత్రమే ఉంటారు.
ఈ వ్యాధిలో..
కాళ్లు, చేతులు సన్నగా ఉండి, పక్కటెముకలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
ఉదరం ఉబ్బినట్లు ఉండి ముందుకు వస్తుంది
చర్మం పొడిగా వేలాడుతూ ముడుతల్లో ఉంటుంది.
ఒబేసిటీ (స్థూలకాయం):
అతిగా తినడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది.
శరీరం మొత్తం బరువులో 20శాతం కంటే ఎక్కువ బరువు కొవ్వుల వల్ల అయితే దాన్ని స్థూలకాయంగా పరిగణిస్తారు.
ఈ వ్యాధి జన్యులోపాల వల్ల కలుగుతుంది.
ఇవి క్రమంగా మధుమేహ వ్యాధికి, హృదయానికి, రక్తనాళాలకు, మూత్రపిండం, పిత్తాశయానికి సంబంధించిన వ్యాధులకు దారితీస్తుంది.
వీరు సంతులిత ఆహారాన్ని పీచు పదార్థాలు గల ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ ఉండటం ద్వారా క్రమంగా ఎడిపోస్ కణాల్లోని కొవ్వు తగ్గి క్రమంగా సన్నబడతారు.
భారతదేశంలో పోషకాహారాలు, పోషకలేమి ద్వారా వచ్చే వ్యాధుల గురించి పరిశోధించే సంస్థ:NIN (National Institute of Nutrition) హైదరాబాద్‌లో ఉంది
విటమిన్ ఎ | కెరటోమలాసియా, జెరోప్థాల్మియా, నిక్టలోపియా (రేచీకటి)బైటాల్ చుక్కలు |
విటమిన్ డి | రికెట్స్, రికెటింగ్ రోజరీ, సొరియాసిస్, ఎముకల్లో డీకాల్సిఫికేషన్ ఇపురుషుల్లో వంద్యత్వం, స్త్రీలల్లో గర్భస్రావం, డిస్మోనోరియా |
విటమిన్ కె | గాయాలైనప్పుడు జరిగే రక్తస్రావంలో రక్తం గడ్డకట్టకపోవడం (హిమరేజ్ Hsemorrahage) |
బి-కాంప్లెక్స్ | |
బి1 (థయమిన్) | బెరి-బెరి, పాలీన్యూరైటిస్ |
బి2 (రెబోఫ్లావిన్) | ఖీలోసిస్, గ్లాసైటిస్, డెర్మటైటిస్ |
బి3 ( నియాసిన్) | పెల్లగ్రా |
బి5 (పాంటోథెనిక్ ఆమ్లం) | రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్, బర్నింగ్ ఫీట్ |
బి6 (పెరిడాక్సిన్) | అనీమియా |
బి7 (బయోటిన్) | రక్తంలో కొలెస్ట్రాల్ అధికమవడం |
బి11(ఫోలిక్ ఆమ్లం) | రక్తహీనత, మానసిక వ్యాధులు |
బి12 (సయనోకోబాలమైన్) | మాక్రోసైటిక్ అనీమియా, పెర్నిసియాస్ అనీమియా |