డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / గ్రేడ్-1 గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ సిలబస్ తెలుగులో
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / గ్రేడ్-1 గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ సిలబస్ మూడు పేపర్లు గా ఉంటాయి.
- పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ విభాగం నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలు
- పేపర్-2: విద్య-1 విభాగం నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలు
- పేపర్-2: విద్య-2 విభాగం నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలు
పేపర్ -1
జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ
- అంతర్జాతీయ, జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వర్తమాన అంశాలు (కరెంట్ అఫైర్స్)
- నిత్యజీవితంలో విజ్ఞానశాస్త్రము మరియు దాని అనువర్తనాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు మరియు సమాచార ప్రసార రంగాలలో ఆధునిక పోకడలు
- భారతదేశ చరిత్ర – సాంఘిక, ఆర్ధిక, సాంస్కృతిక మరియు రాజకీయ రంగాల దృక్కోణంలో అధ్యయనం, ఆంధ్రప్రదేశ్ చరిత్రపై ప్రత్యేక దృష్టి మరియు భారత జాతీయోద్యమం
- ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టితో ఇండియన్
- ఇండియన్ పాలిటీ మరియు పరిపాలన, రాజ్యాంగ సబంధ అంశాలు, ప్రజా విధానాలు, సంస్కరణలు, ఈ- పరిపాలన విధానాలు
- భారత ఆర్థిక శాస్త్రము మరియు ప్రణాళికలు
- సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ పలితం
- విపత్తుల నిర్వహణ – విపత్తుల విశే – విశేషాలు, నియంత్రణ మరియు ఉపశమన వ్యూహాలు, విపత్తుల నిర్వహణలో రిమోట్ సెన్సింగ్ మరియు జిఐఎస్ అనువర్తనములు
- లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ మరియు లాజికల్ ఇంటర్ ప్రిటేషన్
- దత్తాంశ నిర్వహణ – పట్టికల రూపంలో దత్తాంశం, దత్తాంశాన్ని ప్రదర్శించుట మరియు ప్రాధమిక దత్తాంశ విశ్లేషణా ప్రక్రియలు (అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకము మరియు విచలనాలు, వ్యాప్తి)
పేపర్ -2
విద్య – 1 (డిగ్రీ స్థాయిలో)
A) విద్యాతాత్విక ఆధారాలు:
- విద్యా తాత్విక మరియు సామాజిక ఆధారాలు – పరిచయం, స్వభావం మరియు పరిధి
- భావవాదము (ఐడియలిజమ్), ప్రకృతివాదం నేచురలిజమ్), వ్యవహారిక సత్తావాదం (ప్రాగ్మాటిజమ్), ఆదర్శవాదం (రియలిజమ్), అస్తిత్వ వాదం (ఎక్స్టెన్షియలిజమ్)
- గాంధీ, ఠాగూర్, అరబిందో, వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి
- సామాజిక వాదము మరియు విద్య: సామాజిక మార్పులు – విద్య, సంస్కృతి – విద్య, విద్య నవీనీకరణ, విద్యారంగంలో సమాన అవకాశాల కల్పన, వెనుకబడిన తరగతుల వారికి విద్యావకాశాలు
B) విద్యా మనోవిజ్ఞానశాస్త్రము:
- విద్యా మనోవిజ్ఞానశాస్త్రము – పరిచయం: విద్య మరియు మనోవిజ్ఞానశాస్త్రముల మధ్య సంబంధం, విద్యా మనోవిజ్ఞానశాస్త్రము – స్వభావము మరియు పరిధి, విద్యా మనోవిజ్ఞానశాస్త్ర అధ్యయన పద్ధతులు వ్యూహాలు.
- పెరుగుదల మరియు వికాసం: పెరుగుదల మరియు వికాస నియమాలు, వికాస స్థాయిలు – శైశవం, బాల్యం, కౌమారం మరియు వికాసంలోని అంశాలు శారీరక మానసిక, సాంఘిక మరియు ఉద్వేగాత్మక వికాసం, వికాస ప్రాధమిక భావనలు తరగతి గదిలో అనువర్తనము
- అభ్యసనము: అభ్యసనము – స్వభావం, అభ్యసనా సిద్ధాంతాలు (ప్రవర్తనా వాద, నిర్మాణాత్మక మరియు సామాజిక సిద్ధాంతాలు) – వాటి తరగతి గది అనువర్తనము, అభ్యనము మరియు ప్రేరణ, వివిధ రకాల ప్రేరణా పద్ధతులు (అంతర్గత మరియు బహిర్గత ప్రేరణ) – తరగతి గది అనువర్తనము
- వైయుక్తిక భేదాలు మరియు మాపనము: వైయుక్తిక భేదాలు అధ్యయనం – భావన మరియు ప్రాముఖ్యత, వ్యక్తంతర, అంతర్ వ్యక్తి వైయుక్తిక భేదాలు, మూర్తిమత్వము భావన మరియు మాపనము (ప్రక్షేపిత, అప్రక్షేపిత పద్ధతులు), ప్రత్యేక అవసరాలు గల పిల్లలను అర్ధం చేసుకోవడం మరియు విద్యా విషయంగా సహకరించడం, విద్యలో వెనుకబడేవారు, సగటు ప్రజ్ఞావంతులు, సగటు కంటే తక్కువ ప్రజ్ఞావంతులు, ఉన్నత ప్రజ్ఞావంతులు, అత్యుత్తమ ప్రగతి చూపేవారు, సృజనాత్మకత, మంత్రణము మరియు మార్గదర్శకత్వం భావన, – పరిచయం మరియు తరగతి గది ప్రాముఖ్యత.
- సాంఖ్యకశాస్త్రం: భావన మరియు అభ్యాసకులు మరియు బోధకుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి సాంఖ్యక శాస్త్ర ప్రాముఖ్యత, కేంద్రీయ విచలనము, విచలనాలను మాపనం చేయుట, సహసంబంధము మరియు వివిధ పద్ధతులలో సహసంబంధ గణనలు
C) విద్యారంగంలో నూతన పోకడలు:
- విద్య – ప్రపంచీకరణ – ప్రాముఖ్యత, వ్యవస్థాగత హామీ, ప్రపంచీకరణను అమలు చేయడంలో సమస్యలు, ప్రాధమిక విద్యలో నాణ్యత – కనీస అభ్యసనా వ్యూహ స్థాయి.
- విద్యలో వృధా మరియు నిలుపుదల – అర్ధము, కారణాలు, సమస్యలు మరియు సరిచేసే వ్యూహాలు
- వయోజన విద్య అక్షరాస్యత – అర్ధము, పరిధి, నిర్వహణలోని సమస్యలు మరియు నివారణా వ్యూహాలు
- అనియత విద్య – సమకాలీన ప్రాముఖ్యత, సమస్యలు, బోధనా వ్యూహాలు, ప్రేరణాత్మక వ్యూహాలు మరియు అమలు పరచుట
- పాఠశాల మరియు సమాజం సంబంధం – ఆవశ్యకత మరియు ప్రాముఖ్యత, సమాజాన్ని పాఠశాలకు, పాఠశాలను సమాజంలోకి తెచ్చే వ్యూహాలు, సామాజిక వనరులు వినియోగం, సమజంలో ప్రాముఖ్యత గల వ్యక్తుల వినియోగం, పాఠశాల – సమాజం సంబంధాలను మెరుగుపరచుకోవడానికి నిర్మాణాత్మకము వ్యూహాలు ఫలితం
- బోధనా మాధ్యమము – సమస్యలు, భారతదేశంలోని భాషలు, త్రిభాషా సూత్రము – అమలు చేయడంలో సమస్యలు, సమస్యలను అధిగమించుట
- కుటుంబం మరియు జనాభా విద్య – సమస్యలు, సెకండరీ స్థాయిలో అవగాహన కల్పించే లక్ష్యాలు, నిర్వహించడంలో సమస్యలు, కుటుంబం పౌరులు లను సరియైన దారిలో నడిపేందుకు వ్యూహాలు
- విలువల విద్య – అర్ధము మరియు పరిధి, విలువల విద్యను బోధించడంలో వ్యూహాలు, విలువల విద్య మరియు మతపరమైన విద్య మధ్య భేదము, ప్రాక్టికల్ వర్క్
- జాతీయతా మరియు భావోద్వేగ ఏకీకరణ – అర్ధము, స్వభావము, సమస్యలు మరియు జాతీయ దినోత్సవాలను నిర్వహించుట, ఆ సందర్భంలో ఉపాధ్యాయుడు మరియు పాఠశాల పాత్ర
- అంతర్జాతీయ అవగాహన – శాంతి కోసం విద్య, నిరాయుధీకరణ, సహసంబంధాలు – అర్ధము, స్వభావము, ప్రాముఖ్యత, విద్యార్ధులలో సహోదరభావమును పెంపొందించుట
- సామాజికంగా మరియు సాంస్కృతికంగా వెనుకబడినవారి విద్య – భావన, సమస్యలు, అర్ధవంతమైన వ్యూహాలను అమలు చేయడంలో సమానత్వ అవకాశాల కల్పన వ్యూహాలు
- జీవితాంతపు విద్య – అర్ధము, ఆవశ్యకత మరియు పరిధి, ఉపాధ్యాయుని పాత్ర మరియు అనుసరించాల్సిన పద్ధతులు
- ఉపాధ్యాయ విద్య – వృత్తి పూర్వ విద్య, వృత్యంతర విద్య, ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన వృత్తిపరమైన సంస్థలు
- వృత్తి విద్య మరియు విద్య యొక్క వృక్తీకరణ
- ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాధమిక కోర్సులలో సాధారణ ప్రవేశపరీక్షలు మరియు కేంద్రీకృత ప్రవేశ విధానాలు
- విద్యారంగ కమిటీలు, కమిషన్లు
పేపర్ -3
విద్య – 2 (డిగ్రీ స్థాయిలో)
- విద్యారంగంలో వర్తమాన పోకడలు మరియు సవాళ్లు
- విద్యారంగంలో సృజనాత్మకత
- మాపనము మరియు మూల్యాంకనము
- సమ్మిళిత విద్య
- విద్యారంగంలో ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి)
- విద్యారంగ పరిపాలన మరియు పర్యవేక్షణ
- లింగ సంవేద్యీకరణము, లింగ సమానత్వం, మహిళా సమానత్వం మరియు సాధికారత, పట్టణీకరణ మరియు వలసలు, జీవన నైపుణ్యాలు
- పర్యావరణ విద్య
- భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్ లో విద్యా రంగ సంస్కరణలు మరియు విద్యా రంగ పథకాలు
- విద్యా దృక్పథాలు
- విద్యారంగ చరిత్ర
- ఉపాధ్యాయ సాధికారత
- సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు, విశేషాలు
- ప్రజాస్వామ్యము మరియు విద్య, సమానత్వం, సమానత మరియు నాణ్యత, విద్యావకాశాల నాణ్యత
- విద్యా అర్ధ శాస్త్రము – విద్య – మానవీయ పెట్టుబడి, విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి, అక్షరాస్యత – సాక్షర భారత్ మిషన్
- జనాభా విద్య
- సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యా ప్రాముఖ్యత
- విలువల కోసం విద్య, శాంతి కోసం విద్య
- విద్యా సంబంధ పథకాలు మరియు కార్యక్రమాలు – APPEP, DPEP, SSA, NPEGEL, RMSA, RAA (Rastriya Aveshkar Abhiyan), KGBVs, Model Schools
- ప్రోత్సాహకాలు మరియు ప్రత్యేక నిబంధనలు
- చట్టాలు/హక్కులు: విద్యాహక్కు చట్టం – 2009, సమాచార హక్కు చట్టం – 2005 బాలల హక్కులు మరియు మానవ హక్కులు ,జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం – 2005 , జాతీయ విద్యా విధానం – 2020