AP TET 2024 Syllabus pdf download

AP TET 2024 Syllabus pdf

AP TET 2023 కి సంబంధించి FULL SYLLABUS మీకు తెలుగులో అందివ్వడం జరిగింది .

PDF Download కొరకు page క్రిందకి వెళ్ళండి .

సెకండరీ గ్రేడ్ టీచర్ పాఠ్య ప్రణాళిక

విభాగం-1 : శిశు వికాసం – ఉపాధ్యాయ తత్వం (30 మార్కులు)

  1. 1. శిశు వికాసం:
  • వికాసం, పెరుగుదల, పరిపక్వత భావనలు, అర్థం స్వభావం.
  • వికాసం నియమాలు / సూత్రాలు
  • వికాసాన్ని ప్రభావితం చేయు కారకాలు సంబంధమైనకారణాలు జీవ సంబంధమైన, మానసిక సంబంధమైన, సామాజిక
  • వికాసంలోని వివిధ దశలు వాటి మధ్య సంబంధం – శారీరక చలన వికాసం, సంజ్ఞానాత్మక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, భాషా వికాసం, శైశవ దశ నుంచి కౌమార దశ వరకు వచ్చే మార్పులు
  • శిశు వికాస అవగాహన – పియాజె, కోల్ బర్గ్, చోమ్స్క, కార్ల్ రోజర్స్,
  • వైయుక్తిక భేదాలు – వ్యక్తి అంతర, అంతర వ్యక్తి భేదాలు, వైఖరి, సహజ సామర్థ్యం, అభిరుచి, అలవాట్లు,
  • మూర్తిమత్వ వికాసం, భావన – ప్రభావితం చేసే కారకాలు
  • సర్దుబాటు, ప్రవర్తనా సమస్యలు, మానసిక ఆరోగ్యం
  • శిశు వికాసాన్ని అంచనా వేసే పద్ధతులు – పరిశోధన, పరిపుచ్ఛ, వ్యక్తి చరిత్ర, ప్రయోగాత్మక పద్ధతులు, క్రాస్ సెక్షనల్ మరియు లాంగిట్యూడినల్ (సమాంతర మరియు కాలక్రమ)
  • శిశు వికాసం సంక్లిష్టతలు (అడ్డంకులు)
  1. 2. అభ్యసన అవగాహన
  • బోధన, అభ్యసనం స్వభావం – అభ్యసనం జరుగు విధానం:
  • అభ్యసనాన్ని ప్రభావితం చేయు కారకాలు వ్యక్తిగత, పరిసర కారకాలు
  • అభ్యసన సిద్ధాంతాలు, అన్వయం – స్కిన్నర్, పావలోవ్, థారన్ డైక్ ప్రవర్తనా వాదం, పియాజె, వైగోట్స్క సంజ్ఞానాత్మక వాదం, కోహ్లెర్, కోఫ్కా గెస్టాల్ట్ వాదం, బందూరా పరిశీలనాభ్యాసనం
  • అభ్యసనంలోని అంశాలు – సంజ్ఞానాత్మక రంగం, భావావేశ, ప్రదర్శన రంగం,
  • ప్రేరణ మరియు బహుమతులు – అభ్యసనంలో వాటి పాత్ర
  • స్మృతి – విస్మృతి
  • అభ్యసన బదలాయింపు

  • 3. బోధనా శాస్త్రం.
  • బోధనలో అభ్యసనం – అభ్యసకుడికి గల సంబంధం -అభ్యాసకుడు – సంసృ్కతి, సామాజిక రాజకీయ సందర్భాలు
  • అభ్యాసకులు – ప్రత్యేక అవసరాలు గల శిశువులు మరియు విలీన విద్య (Inclusive Education)
  • బోధనా పద్ధతులు – అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, సర్వే పద్ధతి, పరిశీలన, కృత్యాధార పద్ధతి
  • వైయుక్తిక మరియు సమూహా అభ్యసనం – వ్యవస్థీకృత అభ్యసనం, తరగతిలో అభ్యసనం, అభ్యసన అలవాట్లు, స్వీయ అభ్యసనం మరియు అభ్యసన నైపుణ్యాలు -భిన్న సమూహ తరగతిలో వ్యవస్థీకృత అభ్యసనం, సాంఘిక, ఆర్థిక సామర్థ్యాలు, ఆసక్తులు
  • వ్యవస్థీకృత అభ్యసన నిర్మాణం – ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి, విషయ కేంద్రిత పద్ధతి, విద్యార్థి కేంద్రిత
  • బోధన ఒక ప్రణాళికబద్ధమైన కృత్యం – బోధనా ప్రణాళికలోని అంశాలు
  • బోధనలోని దశలు – పూర్వ క్రియాశీలత, ప్రతి చర్య క్రియాశీలత, పరిక్రియాశీలత
  • బోధనకు కావాల్సిన సాధారణ విషయాలకు సంబంధించిన నైపుణ్యాలు, సామర్థ్యాలు అవి కలుగ చేసే వ్యక్తి లక్షణాలు
  • అభ్యసన వనరలు -స్వీయ గృహ, పాఠ శాల, సమాజం, సాంకేతిక పరమైనవి
  • తరగతి గది నిర్వహణ విద్యార్థి పాత్ర, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని నాయకత్వం, శైలి, అభ్యసననానికి అనుకూలమైన వాతావరణం, ప్రవర్తన సమస్యల నిర్వహణ, మార్గ దర్శకత్వం, మంత్రణం, దండన, చట్టపరమైన చర్యలు, పిల్లల హక్కులు, సమయపాలన, నిర్వహణ
  • పూర్వ అభ్యసన అంచనా, అభ్యసనం త ర్వాత అంచనా, పాఠశాల స్థాయి అంచనా, నిరంతర సమగ్ర మూల్యాంకనం, దృక్పథాలు, ఆచరణలు
  • బోధన అభ్యసన అవగాహన పై జాతీయ విద్యా ప్రణాళిక, చట్టం 2005 సిఫార్సులు అభ్యాసం, విద్యాహక్కు చట్టం 2009

విభాగం-2 : భాష-I (కంటెంట్ మరియు మెథడాలజీ మార్కులు 30

భాష-I తెలుగు (కంటెంట్ మరియు మెథడాలజీ- మార్కులు 30

1) అపరిచిత గద్యం 2) అపరిచిత పద్యం.

2) కవులు-రచయితలు- కావ్యాలు-రచనలు ప్రక్రియలు

ఇతిహాసం-పురాణం-ప్రబంధం-శతకం-కథ-కథానిక- గల్పిక విమర్శ- ఆత్మకథ-జీవిత చరిత్ర. వ్యాసం-లేఖ-సంపాదకీయం-వార్తావ్యాఖ్య-

3) క్రియలు సమాపక, అసమాపక క్రియలు, అకర్మక, సకర్మక క్రియలు, వాక్య భేదాలు, రకాలు, వాక్యరీతులు, కర్తర్ధక, కర్మాణార్థక వాక్యాలు ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలు, వాక్య నిర్మాణం, వాక్యక్రమం, సంఘటనాక్రమం ఆధునిక భాష మార్పిడి, ప్రామాణిక లేఖన రూపాలు, మాండలికాలు, అర్థవిపరిణామం.

4) భాషా రూపాలు: గ్రాంధిక భాష, వ్యావహారిక భాష, మాండలిక భాష, అధునిక ప్రామాణిక భాష

5) వర్ణములు: ధ్వని, ధ్వన్యుత్పత్తిస్థానాలు, వర్ణమాల, కళలు, దృత ప్రకృతాలు, పరుషాలు, సరళాలు, భాషా వచనాలు, కాలాలు, లింగం, విభక్తులు, విరామ చిహ్నాలు, అర్ధం, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి-వికృతులు, వ్యతిరేక పదాలు, వ్యుత్పత్యర్థాలు, పొడుపు కథలు, సామెతలు, జాతీయాలు, ఛందస్సు, అలంకారాల

బోధన పద్ధతులు

1. భాష మాతృభాష మాతృభాషబోధన లక్ష్యాలు

2. భాషా నైపుణ్యాలు

3. బోధన పద్ధతులు

4. ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమం

5. బోధనాభ్యసన ఉపకరణాలు, ఆంధ్రసాహితీ సంగ్ర హం

విభాగం-3 :

భాష-|| ఇంగ్లిష్ (కంటెంట్ మరియు మెథడాలజీ – మార్కులు 30

Content

  1. Parts of Speech
  2. Tenses
  3. Types of Sentences
  4. Articles and Prepositions
  5. Degrees of Comparison
  6. Direct Speech and indirect Speech
  1. Clauses
  2. Voice-Active and Passive Voice
  3. Use of Phrases
  4. Comprehension of a Prose Passage
  5. Composition
  6. Vocabulary

Methodology

  1. Aspects of English:-
  2. Objectives of teaching English
  3. Phonetics
  4. Development of Language Skills – Listening , Speaking , Reading , Writing
  1. Approaches, Methods, Techniques of teaching English: Introduction, Definition and Types of Approaches, Methods and Techniques of TeachingEnglish, Remedial Teaching.
  2. Teaching of Structures and Vocabulary Items,
  3. Teaching Learning Materials in English
  4. Lesson Planning
  5. Curriculum & Textbooks
  6. Evaluation in English language:

విభాగం-4: గణితం (కంటెంట్ మరియు మెథడాలజీ మార్కులు 30

  1. సంఖ్యా వ్యవస్థ (ప్రాథమిక సంఖ్యావాదం)

సంఖ్యావస్థ (N, W, Z, Q, R) న్యుమరేషన్, నొటేషన్ (అక్షరాలను అంకెలలో, అంకెలను అక్షరాలలో రాయడం), సంఖ్యలను సంఖ్యారేఖపై సూచించుట, స్థానవిలువలు మరియు చతుర్విద ప్రక్రియలు (సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం), సంఖ్యల ధర్మాలు, వర్గాలు ఘనాలు, ఘనమూలాలు, కారణాంక పద్ధతి, కరణులు – రకాలు, సంయుగ్మ కరణులు, కరణులను అకరణీయం చేయుట, ప్రధాన మరియు సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్యల రకాలు (పరస్పర, సాపేక్ష, కవల ప్రధాన సంఖ్యలు) ఫెర్మాట్ సంఖ్యలు, సరి, బేసి సంఖ్యలు, ప్రధాన కారణాంకాలు, కనిష్ట సామాన్య గణిజం (LCM), గసాభా (GCD) మరియు పరస్పర లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలపై గాస్ సిద్ధాంతం, రోమన్ సంఖ్యలు, భాజనీయతా సూత్రాలు, అంతర్జాతీయ సంఖ్యామానం, భిన్నాల రకాలు, భిన్నాల భావన, దశాంశ భిన్నాలు, అకరణీయ మరియు కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలను క భాగంతో శుద్ధ ఆవర్తన మరియు మిశ్రమావర్తన దశాంశాలుగా సూచించుట మరియు నిజ జీవితంలో వాటి అనువర్తనాలు.

2. అంక గణితం

కొలతలు, పొడవు, బరువు, ఘనపరిమాణం, కాలంను కొలుచుట, ద్రవ్యంను కొలుచుట మరియు వాటి ప్రమాణాలు, వాటి మధ్య సంబంధం, నిత్య జీవితంలో వాటి ఉపయోగం, ఏకవస్తు పద్ధతి, నిష్పత్తి, అనుపాతం, విలోమ నిష్పత్తి అనులోమానుపాతం, విలోమానుపాతం, శాతములు, వర్తక రుసుము, సరాసరి, లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, భాగస్వామ్యం, కాలం-దూరం-పని, గడియారం మరియు కేలండర్కు సంబంధించిన సమస్యలు.

౩.సామాన్య సమీకరణాలు

సమానత్వపు ధర్మాలు, సమీకరణాలు, సమానత్వపు ధర్మాలు ఉపయోగించి సమీకరణాలను సాధించుట, రేఖీయ సమీకరణాలు, వాటి రేఖాచిత్రాలు, రేఖీయ అసమీకరణాల వ్యవస్థ, రెండు చరరాసుల్లో రేఖీయ సమీకరణాలు, రేఖీయ సమీకరణాల వ్యవస్థ, గ్రాఫులు, రెండు చరరాసుల్లో సమన్విత సమీకరణాలు, పరస్పరాధార సమీకరణాలు, సమీకరణాల వ్యవస్థ, రేఖీయ ప్రమేయాలు.

4. బీజ గణితం:

బహుపదుల్లో చతుర్విద ప్రక్రియలు, బీజీయ సమాసాల వర్గమూలాలు, బహుపది శూన్యాలు, బహుపది కారణాంకాలు, శేష సిద్ధాంతం, హార్నర్ సంశ్లేషణ పద్ధతి, వర్గ సమీకరణాలు, సమితులు.

మౌళిక భావనలు, బీజీయ సమాసాలు మరియు వాటి ప్రాథమిక ప్రక్రియలు, ఏకపది పరిమాణం, బహుపది, శూన్యవిలువ, బహుపదులు, ప్రాథమిక ప్రక్రియలు, సమాసం విలువ సమీకరణాలను సాధించుట, బహుపదులు

ప్రాథమిక పరిక్రియలు, సమాసం, విలువ, సమీకరణాలను సాధించుట, బహుపదుల ధర్మాలు, బహుపదుల ప్రాథమిక ప్రక్రియలు, కారణాంక విభజన, పూర్ణసంఖ్య, ఘాతాంక బహుపది, బహుపదులను సూక్ష్మీకరించుట, కొన్ని ప్రత్యేక లబ్దాలు, బీజీయ సమాసాల వర్గమూలాలు, అకరణీయ, దశాంశ గుణక సమీకరణాలు, సమితిభావన, సమితి రకాలు, సమితి నిర్మాణ రూపం, సమితి జాబితా రూపం, సమితుల సమానత్వం, తుల్య సమితులు, సమితులతో ప్రాథమిక పరిక్రియలు, పూరక సమితి, సమితిలో పరిక్రియల ధర్మాలు, ద్వైత నియమం, సంబంధాలు సంబంధాలలో రకాలు, బహుళపదిని ఏకపదిచే గుణించుట, ద్విపద విస్తరణలు, సర్వసమానత్వాలు, భాగహార ధర్మం, (శేష సిద్ధాంతం) కారణాంక విభజన, HCF, (గసాభా), బహుళపది కారణాంకాలు, ఉమ్మడి ద్విపద కారణరాశి, ఒక ఏకపదిని మరొక ఏకపదిచే గుణించుట, వర్గబహుపది. కారణాంక విభజన, ఘాతాలు, ఘాతాంకాలు, ఘాతాంక న్యాయాలు, సున్న ఘాతాంకంగా గల ఘాతాంకాలు, సూత్రాలు మరియు ఉపయోగాలు, సూత్రాలతో కర్తను మార్చుట, హార్నర్ సంశ్లేషిత భాగహార పద్ధతి, వర్గ మీకరణాలపై ఆధార పడ్డ సమస్యలు, ఘాతాంక న్యాయాలు, వాస్తవ సంఖ్య పరమ మూల్యం.

5. రేఖా గణితం:

రేఖాగణిత నిర్మాణం మరియు చారిత్రక నేపథ్యం, నిత్య జీవితంలో రేఖా గణితం, రేఖా గణితం ప్రాథమిక భావనలు, నిరూపణ పద్ధతులు, విపర్య భావన, కోణం యొక్క భ్రమణం, కోణాలు-రకాలు, కోణాలను కొలుచుట మరియు నిర్మించుట, రేఖా సౌష్టవాక్షం, ఆకారాలు, పరావర్తనాలు, సౌష్టవం, రేఖీయ సౌష్టవం, బిందు సౌష్టవం, పరావర్తన కోణం యొక్క ప్రతిబింబం, వేర్వేరు కోణాలను కొలుచుట, వివిధ కోణాలను నిర్మించుట, రేఖా ఖండాలు, మధ్య బిందువు మొదలైనవి.

త్రిభుజం దాని ధర్మాలు, రకాలు, భాగాలు, త్రిభుజంలో అసమానత్వాలు, అనుషక్తం, సరూప త్రిభుజాలు, వీటి ధర్మాలు, త్రిభుజాల సర్వసమానత్వం, భు.కో.భు / కో.భు.కో, భు.భు.కో. (భు=భుజం, కో-కోణం), స్వీకృతాలు, కొన్ని సిద్ధాంతాలు, త్రిభుజాల నిర్మాణం, సందిగ్ధ సందర్భం, వేర్వేరు రకాలు, త్రిభుజాలు అనుషక్త రేఖలు, త్రిభుజ మధ్యగత రేఖలు, ఉన్నతులు, త్రిభుజ పరివృత్త కేంద్రం, అంతరవృత్త కేంద్రం, బాహ్య కేంద్రం, గురుత్వ కేంద్రం, లంబకేంద్రం.

వృత్తం దాని భాగాలు, బిందు పథం, వృత్తాల సర్వసమానత్వం

చక్రీయ చతుర్భుజాలు: స్వీకృతాలు, సరళరేఖ ప్రాథమిక భావనలు, యూక్లిడ్ సమాంతర స్వీకృతం, సమాంతర రేఖలపై కొన్ని సిద్ధాంతాలు

భహుభుజి కోణాలు: బహుభుజులపై సిద్ధాంతాలు, సరూప బహుభుజులు సమాంతర చతుర్భుజం మరియు దాని ధర్మాలు, రేఖగణిత అసమానత్వాలు

చతుర్భుజాలు: బాహ్యం అంతరం, కుంభాకార బహుబజి మరియు దాని నిర్మాణాలు, త్రిమితీయ వస్తువుల భాగాలు, త్రిమతీయ వలల చిత్రాలు, కొన్ని సిద్ధాంతాల వివర్తనం.

6. క్షేత్ర గణితం (కేత్ర మితి):

త్రిభుజం చతుర్భుజం, త్రిజ్యాంతరం, వృత్తం, వివిధ రకాల బాటలు, బహుభుజులు చుట్టుకొలతలు, మరియు వైశాల్యాలు, గది నాలుగు గోడల చుట్టుకొలత మరియు వైశాల్యం, ఘనం మరియు దీర్ఘఘనంల ఉపరితల వైశాల్యాలు, మరియు ఘనపరిమాణాలు, ప్రమాణాల మార్పిడి..

7. దత్తాంశ నిర్వహణ, సాంఖ్యక శాస్త్రం :

దత్తాంశ పరిచయం,దత్తాంశ నివేదన, పటం నిర్మించుటకు మార్గదర్శకాలు, పట చిత్రాల నిర్మాణాలు, కమ్మి చిత్రాలు, వృత్తాకార రేఖా చిత్రం, పౌనఃపున్య విభాజన పట్టిక, పౌనఃపున్య రేఖా చిత్రాలు, బహుభుజి పౌనఃపున్య

వక్రాలు, ఓగైవ్ వక్రాలు, సరాసరి, మధ్యగతం, బాహుళకం.

బోధన పద్ధతులు

  1. గణిత శాస్త్రం అర్థం, స్వభావం, నిర్వచనాలు
  2. నిత్య జీవితం, ఇతర పాఠ్య విభాగాలతో గణితానికి ఉన్న సంబంధం
  3. గణిశాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు
  4. గణితంలో శిశు కేంద్రీకృత, కృత్యాధార బోధన
  1. గణితం బోధనా పద్ధతులు, లోప నివారణ లేదా ప్రత్యుపాయ పద్ధతులు
  2. గణితంలో బోధనోపకరణ సామాగ్రి, బోధన మరియు అభ్యసన మెటీరియల్ గణిత శాస్త్రంలో వనరుల
  3. గణిత శాస్త్ర విద్యా ప్రణాళిక, పాఠ్య గ్రంథం, వ్యవస్థీకృత ప్రణాళిక
  4. గణితంలో మూల్యాంకనం, మూల్యాంకన సాధనాలు, నిరంతర నిర్మాణాత్మక మూల్యాంకనం.

విభాగం-5

పరిసరాల విజ్ఞానం కంటెంట్ మరియు మెథడాలజీ మార్కులు 30

పరిసరాల విజ్ఞానం – 1

కంటెంట్ – భూగోళశాస్త్రం

  1. సౌర కుటుంబం – మన భూమి: సౌరవ్యవస్థ పుట్టుక – పరిణామం, నక్షత్ర మండలం, సౌరవ్యవస్థలో భూమి ఒక సభ్యుడు, భూ ఆవిర్భావం, భూ అంతర్భాగం, భూ చలనాలు (భూ భ్రమణం, భూ పరిభ్రమణం)- వాటి ఫలితాలు, అక్షాంశాలు – రేఖాంశాలు, ప్రామాణిక కాలం మరియు అంతర్జాతీయ దిన రేఖ
  2. ప్రధాన భూస్వరూపాలు: పర్వతాలు, పీఠభూమి మరియు మైదానాలు, ప్రపంచంలో పర్వతాల వర్గీకరణ మరియు విస్తరణ, పీఠభూముల వర్గీకరణ, విస్తరణ, మైదానాల వర్గీకరణ, భూస్వరూప విధానం, శిలాశైథిల్యం, క్రమక్షయం, కోతకు గురికావడం, మేట వేయడం, నేలల పుట్టుక మరియు విస్తరణ
  3. వాతావరణ శాస్త్రం: (శీతోష్ణస్థితి మరియు వాతావరణం): వాతావరణం – అమరిక, నిర్మాణం, సూర్యపుటం సూర్యపుటాన్ని ప్రభావితం చేసే కారకాలు, ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతను అదుపు చేసే కారకాలు, ఉష్ణోగ్రతా విలోమం, పీడనం – ప్రపంచ పీడన మేఖలలు, పవనాలు – ప్రపంచ పవనాలు, రుతుపవనాలు, స్థానిక పవనాలు, ఆర్ద్రత మరియు అవపాతం, వర్షపాతం – రకాలు మరియు విస్తరణ
  4. జలావరణం: సముద్రాలు, సముద్ర నీటి ఉష్ణోగ్రత మరియు ఉష్ణోగ్రత విస్తరణను ప్రభావితం చేసే కారకాలు, సముద్ర ప్రవాహాలు, తరంగాలు, ఆటుపోటులు
  5. ప్రకృతి వైపరీత్యాలు లేదా విపత్తులు: వరదలు, కరువు లేదా అనావృష్టి, తుఫానులు, సునామీలు, టోర్నడోలు, అగ్ని పర్వతాలు, భూకంపాలు, భూపాతాలు (కొండ చరియలు, మంచు తలాలు విరిగి పడటం).
  6. ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలు: భూమధ్య రేఖ మండలం, ఉష్ణ మండల ఎడారులు, సవన్నా లేదా ఉష్ణ మండల భూమలు, గడ్డిభూముల ప్రాంతం, రుతుపవన భూములు, మధ్యధరా ప్రాంతం, టైగా ప్రాంతం
  7. ఖండాలు: అసియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అస్ట్రేలియా మరియు అంటార్కిటికా మరియు విస్తరణ, భౌతిక లక్షణాలు, శీతోష్ణస్థితి, సహజ ఉద్భిజ సంపద మరియు

వన్యప్రాణులు, జనాభా, వ్యవసాయం, ఖనిజ సంపద, పరిశ్రములు, రవాణా మరియు వాణిజ్యం

  1. భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం: ఉనికి మరియు విస్తరణ, భౌతిక స్వరూపాలు, నిమోన్నతాలు మరియు పరివాహక ప్రాంతం, శీతోష్ణస్థితి, సహజ ఉద్భిజ సంపద, నేలలు, సాగుభూమి, శక్తి, జనాభా, ఖనిజ సంపద, మరియు పరిశ్రమలు, రవాణా మరియు కమ్యూనికేషన్, సముద్ర రేవులు మరియు పట్టణాలు, దర్శనీయ ప్రదేశాలు

చరిత్ర

  1. గతాన్ని అధ్యయనం చేయడం: పూర్వచారిత్రక మరియు ప్రాచీన చారిత్రక యుగం అధ్యయనం

ఎ) కాంస్య యుగపు నాగరికత

బి) ప్రాచీన ఇనుపయుగ నాగరికత సమాజాలు: నాగరికత ప్రగతిపై ఇనుపయుగం ప్రభావం, భారతదేశంలో తొలి ఇనుపయుగ నాగరికత, ప్రాచీన చైనా నాగరికత, పర్షియన్ నాగరికత, గ్రీకు మరియు రోమన్ నాగరికత, జుడాయిజం మరియు క్రైస్తవ మతం

సి) ప్రాచీన భారతదేశ నాగరికత: సింధులోయ నాగరికత, ఆర్య నాగరికత, తొలి వేద మరియు మలి వేద నాగరిక

తలు

  1. క్రీ.పూ. 6వ శతాబ్దంలో మత సంస్కరణ ఉద్యమాలు జైన మతం, బౌద్ధమతం
  2. క్రీ.పూ. 200 నుంచి 300 వరకు భారతదేశం: మార్యులు, ఆంధ్ర శాతవాహనులు, పర్షియన్లు, గ్రీకు యాత్ర సామ్రాజ్యం, సంగమ వంశం, కుషాణులు
  3. కీ.పూ. 300 నుంచి 800 వరకు భారతదేశం: గుప్త సామ్రాజ్యం, పుష్యభూతి వంశం (హర్షవర్ధనుడు)
  4. దక్షిణ భారత దేశ రాజవంశాలు: చాళుక్యులు, పల్లవులు, చోళులు, రాష్ట్రకూటులు, యాదవులు, కాకతీయులు
  5. భారతదేశంలో తురుష్కుల (అరబ్బులు) దండయాత్రలు: భారతదేశంపై అరబ్బుల దండయాత్రల సమయంలో భారత్లో పరిస్థితులు, గజనీ దండయాత్రలు, దండయాత్రల ఫలితాలు.
  6. ఢిల్లీ సుల్తానులు: బానిస వంశం, ఖర్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం, ఢిల్లీ సుల్తానుల పతనం, సూఫీ ఉద్యమం, భక్తి ఉద్యమం, భారతీయ సంసృ్కతిపై ఇస్లాం ప్రభావం
  1. మధ్యయుగ దక్షిణ భారతదేశ రాజవంశాలు: కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, బహమన
  2. మొగల్ సామ్రాజ్యం: బాబర్ దండయాత్ర సమయంలో భారతదేశం పరిస్థితులు, బాబర్, హుమయున్, షేర్ అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు, మొగల్ సామ్రాజ్య పతనం, మరాఠాల(మహారాష్ట్రల ఆవిర్భావం, సిక్కుల చరిత్ర
  1. యూరోపియన్ల రాక: పోర్చుగీసు, డచ్, ఫ్రెంచి, మరియు బ్రిటిషు వారు, ఆంగ్ల ఫ్రెంచి యుద్ధాలు, – కర్ణాటక యుద్ధాలు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, | గవర్నర్ జనరల్స్ మరియు వైశ్రాయ్లు, సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు
  2. భారత్ లో సాంసృ్కతిక వారసత్వం: కళలు, వాస్తుశిల్పం, విద్యాభివృద్ధి, సాంస్కృతిక ఏకత్వం మరియు

12.1857 – 1947 మధ్య భారతదేశం: బ్రిటిషు పాలనా కాలంలో రాజకీయ, ఆర్థిక, మరియు సాంఘిక విధానాలు, భారతీయ రాజులు, పొరుగు దేశాల పట్ల బ్రిటిషు విధానాలు

  1. బ్రిటిష్ పాలనా కాలంలో ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పులు: వ్యవసాయం, 1857-1947 మధ్య కాలంలో వ్యవసాయం, ఇతరత్రా రంగాల్లో వచ్చిన మార్పులు, రవాణా సౌకర్యాలు, పరిశ్రమల అభివృద్ధి, సమాజంలో నూతన వర్గాల అభివృద్ధి
  2. జాతీయ ఆవిర్భావం స్వాతంత్ర సంగ్రామం: జాతీయవాదం ఆవిర్భావానికి కారణాలు, భారత – జాతీయ కాంగ్రెస్, మితవాదులు- అతివాదులు, వందేమాతర ఉద్యమం, హూంరూల్ ఉద్యమం, గాంధీ యుగం, క్విట్ ఇండియా ఉద్యమం, మౌంట్ బాటన్ ప్రణాళిక, స్వదేశీ సంస్థానాల విలీనీకరణ, (ఫ్రెంచి, పోర్చుగీసు కాలనీల నుంచి భారతీయ ప్రాంతాల విడుదల
  3. ఆధునిక ప్రపంచం: ఆధునిక యుగం ప్రారంభం, పునరుజ్జీవనం, ఆధునిక శాస్త్రాల అభివృద్ధి, సంస్కరణోద్యమాలు, జాతీయోద్యమాలు
  4. ప్రపంచ యుద్ధాలు: మొదటి ప్రపంచ యుద్ధం, నానాజాతి సమితి, రెండో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం త ర్వాత ప్రపంచం

పౌరశాస్త్రం:

  1. కుటుంబం, వృత్తులు: మన ఇళ్లు – మన నివాసం సమాజం – రకాలు, సమాజాభివృద్ధి, పౌర జీవనం, సాంఘిక దురాచారాలు, మన ప్రభుత్వం, స్థానిక స్వపరిపాలన, గ్రామీణ పట్టణ అధికారాల వికేంద్రీకరణ, జిల్లా పరిపాలన, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్రాల్లో కార్యనిర్వాహక మండలి, శాసన వ్యవస్థ, భారత పార్లమెంటు, రాష్ట్ర విధాన సభ, శాసన వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ, కేంద్ర రాష్ట్రాల్లో న్యాయవ్యవస్థ నిర్మాణం, పౌర హక్కులు- కోర్టుల రక్షణ, లోక్ అదాలత్లు
  2. భారత రాజ్యాంగం: ఒక దేశంగా భారత్, ప్రవేశిక, భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, సమాఖ్య మరియు ఏకకేంద్ర రాజ్యంగా భారతదేశం, భిన్నత్వంలో ఏకత్వం మరియు జాతీయ సమగ్రత, భారత ప్రజాస్వామ్యం – అర్థం, స్వభావం, ఎన్నికలు మరియు ఎన్నికల ప్రక్రియ, ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలపాత్ర, అధ్యక్ష తరహా మరియు పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం, సమాచార జాగృతి, సమాచార హక్కు చట్టం, సామ్యవాదం – అర్థం, నిర్వచనం, సామ్యవాద లక్షణాలు, దేశంలో సామాజిక అవరోధాలు, ఆచరణలో సామ్యవాదం, మనదేశం ఎదరుక్కొంటున్న సవాళ్లు నిరక్షరాస్యత, ప్రాంతీతత్వం, మతతత్వం, బాలలు వారి హక్కులు, వ్యక్తులు, చట్టాలు, సమాజం, సమాజ వ్యతిరేక కార్యకలాపాలు, లౌకికత్వం: లౌకికత్వంఆవశ్యకత మరియు ప్రాధాన్యత, భారతదేశం – మత సామరస్యం, దేశంలో లౌకికత్వం వికాసం
  3. ప్రపంచ శాంతి భారత దేశం పాత్ర : అంతర్జాతీయ రంగంలో భారతదేశం, భారత విదేశాంగ విధానం, అలీన విధానం, భారతదేశం మరియు కామన్వెల్త్, అగ్రరాజ్యాలతో భారతదేశ సంబంధాలు, భారతదేశం పొరుగు దేశాలు, భారతదేశం సార్క్, మూడో ప్రపంచ దేశాలు భారతదేశం పాత్ర, ఐక్యరాజ్య సమితి – సమకాలీన ప్రపంచ సమస్యలు, ఐక్యరాజ్య సమితిప్రధాన అంగాలు, మరియు, ప్రత్యేక అనుబంధ సంస్థలు, విధులు సాధించిన విజయాలు, ఐక్యరాజ్య సమితిలో భారతదేశం పాత్ర, సమకాలీన ప్రపంచ సమస్యలు, నూతన అంతర్జాతీయ ఆర్థిక విధానం, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు
  4. రవాణా విద్య రోడ్డు భద్రతా విద్య

అర్ధ శాస్త్రం

  1. అర్ధ శాస్త్రం నిర్వచనం, పరిధి, ప్రాముఖ్యత: అర్థ శాస్త్రంవర్గీకరణ – సూక్ష్మ, స్థూల అర్ధ శాస్త్రం, అర్ధ శాస్త్రం భావనలు – వివిధ రకాల వస్తువులు, సంపద, ఆదాయం, ప్రయోజనం, విలువ, ధర, కోరికలు, సంక్షేమం, అర్థశాస్త్రం ప్రాథమిక మౌళిక భావనలు – ప్రయోజనం రకాలు, వినియోగం, ఉత్పత్తి, పంపిణీ, కొరత, ఆర్థిక ప్రతినిధులు. ఉత్పత్తి కారకాలు భూమి. శ్రమ, మూలధనం మరియు వ్యవస్థాపన, వాణిజ్య వ్యవస్థీకరణ
  2. డిమాండ్ సిద్ధాంతం: నిర్వచనం, డిమాండ్ కారకాలు లేదా నిర్ణాయకాలు, డిమాండ్ పట్టిక, వైయుక్తిక మరియు మార్కెట్ డిమాండ్ పట్టిక, డిమాండ్ సూత్రం, డిమాండ్ రేఖ, డిమాండ్ ఫలం
  3. సప్లై: నిర్వచనం, సప్లై నిర్ణాయకాలు, సప్లై పట్టిక, వైయుక్తిక మరియు మార్కెట్ సప్లై పట్టిక, సప్లై సూత్రం,
  4. విలువ సిద్ధాంతం మార్కెట్ల వర్గీకరణ, పరిపూర్ణ పోటీ లక్షణాలు, ధర నిర్ణయం
  1. పంపిణీ సిద్ధాంతం: ఆదాయ పంపిణీ, ధర నిర్ణాయక కారకాలు, అద్దె (బాటకం), వేతనం వడ్డీ మరియు
  2. ఆర్థిక వ్యవస్థ రకాలు: పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ మరియు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
  3. జాతీయాదాయం: జాతీయాదాయం నిర్వచనం, భావనలు, స్థూల జాతీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి, కారకాల దృష్ట్యా జాతీయాదాయం. వైయుక్తిక ఆదాయం, తలసరి ఆదాయం, నామమాత్ర మరియు వాస్తవ స్థూల జాతీయోత్పత్తి . జాతీయాదాయం మరియు పంపిణీ, జీవన ప్రమాణం, మానవాభివృద్ధి, ఆర్థిక అసమానతలు, పేదరిక రేఖ
  4. బడ్జెట్: బడ్జెట్ అర్థం, నిర్వచనం, కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు, బడ్జెట్ రకాలు – మిగులు, సంతులిత, లోటు బడ్జెట్లు, రాబడి రకాలు, పన్నులు ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, రెవెన్యూ వర్గీకరణ, బడ్జెట్ వ్యయం, లోటు – రకాలు
  5. ద్రవ్యం: అర్థం, ద్రవ్యం విధులు, దవ్యం వర్గీకరణ మరియు సప్లై
  6. బ్యాంకింగ్: వాణిజ్య బ్యాంకులు విధులు, కేంద్ర బ్యాంకు ఆవిర్భావం- విధులు, భారతీయ రిజర్వు బ్యాంక్
  7. ఆర్థిక వృద్ధి – ఆర్థికాభివృద్ధి: ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, భావనలు, సూచికలు, ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే కారకాలు, భారత్, ఆంధ్రప్రదేశ్లో ఆర్థికాభివృద్ధి
  8. భారత ఆర్థిక వ్యవస్థ : స్వాతంత్య్రానికి ముందు భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ, వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలు జనాభా భారత్, ఆంధ్రప్రదేశ్ జనాభా, జనన రేటు మరియు మరణ రేటు, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ జనాభాలో వృత్తుల వారి విభజన, మానవ వనరుల అభివృద్ధి నిర్వచనం, ఆర్థికాభివృద్ధిలో విద్య, ఆరోగ్యం పాత్ర, మానవాభివృద్ధి సూచీ, వ్యవసాయం భారత వ్యవసాయ రంగం లక్షణాలు, ప్రాధాన్యత, అల్ప ఉత్పాదకతకు కారణాలు, భారత్లో ఉత్పాదకతను పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భారత్, ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు, హరిత విప్లవం పారిశ్రామిక రంగం: భారత ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగం పాత్ర, పరిశ్రమలు – రకాలు తృతీయ రంగం సేవల రంగం): భారత ఆర్థిక వ్యవస్థలో తృతీయ రంగం ప్రాధాన్యత భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు- పేదరికం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు ప్రణాళికలు – నిర్వచనం భారత్లో
  1. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ: రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, వ్యవసాయ రంగం సేవా రంగం, నీటి పారుదల, శక్తి మరియు విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, రవాణా, గృహ వసతి, సాంకేతిక విజ్ఞానం, ఆంధ్రప్రదేశ్ లో సహజ వనరులు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి, తలసరి ఆదాయం, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో సమస్యలు

బోధన పద్ధతులు

  1. సాంఘికశాస్త్రం స్వభావం, పరిధి
  2. సాంఘికశాస్త్రం ఆశయాలు, లక్ష్యాలు, విలువలు
  3. సాంఘికశాస్త్రం బోధన పద్ధతులు, బోధన మాధ్యమాలు
  4. సాంఘికశాస్త్ర బోధనోపకరణాలు/సామాజిక వనరుల వినియోగం
  5. పాఠ్య ప్రణాళిక అమలు విధానం, పాఠ్య పుస్తకంమరియు వ్యవస్థీకృత ప్రణాళిక
  6. మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం

పరిసరాల విజ్ఞానం 2

విషయం కంటెంట్

  1. నిత్యజీవితంలో జీవశాస్త్రం పాత్ర: విజ్ఞాన శాస్త్రజ్ఞులు – వారి సేవలు – దేశంలో ప్రముఖ శాస్త్రీయ సంస్థలు – జీవశాస్త్ర శాఖల
  2. సజీవ ప్రపంచం: మొక్కలు, జంతువుల వర్గీకరణ, మొక్కలు మరియు జంతువుల జీవితం

వృక్ష ప్రపంచం: వివిధ రకాల మొక్కల భాగాలు, మొక్కల్లో కిరణ జన్య సంయోగ క్రియ, పునరుత్పత్తి – లైంగిక ప్రత్యుత్పత్తి, మొక్కలు – ఆర్థిక ప్రాముఖ్యత, మొక్కలు – వ్యాధులు, వన్యజాతి, సాగు మొక్కలు జంతు ప్రపంచం: వన్యప్రాణులు – పెంపుడు జంతువులు, జంతువుల పళ్ల నిర్మాణం ఆహారపు అలవాట్లు, కప్ప, దోమ, ఈగ జీవిత చ రిత్ర, జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత సూక్ష్మజీవుల ప్రపంచం: వైరస్, బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు మరియు ప్రోటోజోవన్లు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మరియు హానికర లేదా అపాయకరమైన సూక్ష్మజీవులు

  1. మానవ శరీరం ఆరోగ్యం పరిశుభ్రత భద్రత – ప్రథమ చికిత్స: –

మానవ శరీరం – బాహ్య అంతర్గత అవయవాలు, ఎముకలు కండరాలు, జ్ఞానేంద్రియాలు, మానవ శరీరంలోని వ్యవస్థలు, జీర్ణక్రియ, విసర్జన క్రియ, నాడీ వ్యవస్థ, శ్వాసక్రియ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రమాదాలు –

భద్రత, ప్రథమ చికిత్స, మానవుడిలో వివిధ రకాల వ్యాధులు, వైరల్ వ్యాధులు, బ్యాక్టీరియా వ్యాధులు.

న్యూనత వ్యాధులు, వ్యాధులకు కారణాలు – వ్యాధుల నివారణ – నియంత్రణ చర్యలు:

  1. వ్యవసాయం – పశుసంవర్ధనం వ్యవసాయ కార్యకలాపాలు, పంట తెగుళ్లు, చీడ పీడ నియంత్రణ పద్ధతులు, పట్టు సంవర్ధనం, మత్య్స సంవర్ధనం (చేపల పెంపకం), అవులు, గేదెల ప్రజననం
  2. మన పర్యావరణం: జీవ, నిర్జీవ కారకాలు, పర్యావరణ పరిరక్షణ
  3. ఎ. ఆహారం: వివిధ రకాల ఆహార పదార్థాలు పోషకాహారం, ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలు నిల్వ

బి. నివాసం: నివాసం ప్రాముఖ్యత – వివిధ రకాల ఇళ్లు, విద్యుత్ వస్తువులు వాటి ఉపయోగం – జాగ్రత్తలు,

జంతువుల ఆవాసాల్లో వ్యత్యాసం, చీమలు, తేనెటీగల్లో సంఘజీవనం.

ఆటలు: వృత్తులు – బాల కార్మికులు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ, ఆటలు, శ్వాసక్రియపై ఆటల ప్రభావం, మార్షల్ ఆర్ట్స్, సంతు – సర్కస్లు

7. మన విశ్వం: నక్షత్ర మండలాలు, రాశిచక్రం – నక్షత్రాలు, ఉల్కలు తోక చుక్కలు. –

8. కొలతలు – ప్రమాణాలు: వివిధ రకాల కొలతల పద్ధతులు, పొడవు, త్రిభుజీకరణ పద్ధతి, కొలతల పరికరాలు వెర్నియర్ కాలిపర్స్, వైశాల్యం, ఘనపరిమాణం, కాలం, ద్రవ్యరాశి, సాంద్రత కొలమానాలు.

9. సహజ వనరులు – గాలి, నీరు: సహజ వనరులు – గాలి దాని సంఘటనం, వాతావరణ పీడనం, గాలి కాలుష్యం, హరిత గృహ ప్రభావం, నీటి కాఠిన్యత, తాగునీరు, నీటి కాలుష్యం, పవనం, వర్షపాతం, తుఫానులు, పాస్కల్ సూత్రం, ఆర్కిమెడిస్ సూత్రం, బాయిల్ నియమం, బెర్నౌలి సూత్రం.

10. సహజ దృగ్విషయాలు: కాంతి స్వభావం, కాంతి జనకాలు, కాంతి ప్రసారం, పరావర్తనం, పరావర్తన

పరావర్తన సూత్రాలు, వక్రీభవనం, సమతల దర్పణంలో ప్రతిబింబం ఏర్పడే విధానం, గోళాకార దర్పణాలపై కాంతి పరావర్తనం, వక్రీభవనం

ధ్వని ధ్వని తరంగాలు – రకాలు, ధ్వని యానకం, ధ్వని పరావర్తనం, ధ్వని కాలుష్యం, ధ్వని ప్రసారం, సంగీత వాయిద్యాలు

ఉష్ణం; ఉష్ణం – జనకాలు, ఉష్ణ ప్రసారం, ఉష్ణం ఉష్ణోగ్రత, ఉష్ణం మరియు ఉష్ణోగ్రత ప్రమాణాలు – కొలమానాలు, పరికరాలు, ఘన, ద్రవ, వాయు పదార్థాలపై ఉష్ణ వ్యాకోచం ప్రభావం, ఉష్ణస్థితిలో మార్పు

  1. యాంత్రిక శాస్త్రం – శుద్ధ గతిక శాస్త్రం గతిశాస్త్రం: చలనం చలనంలోని రకాలు, వడి వేగం, అదిశలు – సదిశలు, త్వరణం, న్యూటన్ గమన నియమాలు, గురుత్వ కేంద్రం – స్థిరత్వం, అనువర్తనాలు
  2. అయస్కాంతత్వం: సహజ, కృత్రిమ అయస్కాంతాలు, అయస్కాంత ధర్మాలు, అయస్కాంత ప్రేరణ
  3. విద్యుత్; స్థిర విద్యుత్, ప్రాథమిక ఘటాలు, విద్యుత్ వలయాలు, టార్చ్ లైట్, విద్యుత్ ప్రవాహం – అయస్కాంత ఫలితాలు, ఉష్ణ ఫలితాలు, రసాయన, విద్యుత్ ఫలితాలు
  4. ఆధునిక ప్రపంచం పరికరాలు: కంప్యూటర్ భాగాలు, ఉపయోగాలు, టెలిఫోన్, నిస్తంత్రి వ్యవస్థలు – రేడియో ప్రసారాలు, దూరద ర్శిని, ధ్వని ఉత్పత్తి, సంగ్రహణం, అయస్కాంత రికార్డింగ్ మరియు పునరుత్పాదన, సినిమా ప్రొజెక్టర్
  5. పదార్థాలపై ఉష్ణ ప్రభావం, రసాయన చర్యలు: ఉష్ణం ప్రభావం, భౌతిక రసాయన మార్పుల మధ్య తేడాలు, రసాయన చర్యల రకాలు.
  6. సంకేతాలు, సాంకేతికాలు, సమీకరణాలు: సంకేతాలు, సాంకేతికాలు, రాశులు మరియు సంకేతాలు, రసాయన సమీకరణాలు అర్థం, తుల్య రసాయన సమీకరణం, వాటిపై ఆధారపడిన గణనలు, మరియు క్రియాజనకాలు, క్రియాజన్యాల మధ్య భార, భార సంబంధ గణనలు
  7. రసాయన సంయోగ నియమాలు: ద్రవ్య నిత్యత్వ నియమం, స్థిరానుపాత నియమం, బాహ్వానుపాత
  8. నీ దాని సంఘటిత మూలకాలు: నీటి ఘనపరిమాణాత్మక సంఘటనం, పారిశ్రామిక మరియు ఇతర ఉపయోగాలు, ప్రయోగశాలలో హైడ్రోజన్ తయారీ, హైడ్రోజన్ ధర్మాలు – ఉపయోగాలు, ప్రయోగశాలలో ఆక్సీజన్ తయారీ, ఆక్సీజన్ దర్మాలు – ఉపయోగాలు
  9. సల్ఫర్ దాని సమ్మేళనాలు: సల్ఫర్ తయారీ దాని రూపాంతరాలు, సల్ఫర్ ధర్మాలు, ఉపయోగాలు, సల్ఫర్ ఆక్సైడ్ తయారీ సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీ, ధర్మాలు, ఉపయోగాలు, ప్రయోగశాలలో హైడ్రోజన్ సల్ఫైడ్త యారీ ధర్మాలు

20. నత్రజని – దాని సమ్మేళనాలు: గాలి నుంచి నైట్రోజన్ ను సంగ్రహించడం, ఏయోగశాలలో నైట్రోజన్ తయారీ, ధర్మాలు – ఉపయోగాలు, నత్రజని దాని సమ్మేళనాలు, అమ్మోనియా, అమ్మోనియం లవణాలు, నత్రికామ్లం – ప్రయోగ శాలలో నత్రికామ్లం తయారీ, ధర్మాలు, నత్రజని స్థాపన, నత్రజని చక్రం, నైట్రెట్స్ పరీక్షలు.

21. భాస్వరం – దాని సమ్మేళనాలు: భాస్వరం ఉనికి, విద్యుత్ పద్ధతి, భాస్వరం ధర్మాలు – ఉపయోగాలు, భాస్వరం సమ్మేళనాలు

22. సాధారణ ఉప్పు – దాని సంఘటనం: సాధారణ ఉప్పు, బైన్ద్రవణం, బ్రైన్ ద్రావణ విద్యుత్ విశ్లేషణం, క్లోరిన్, క్లోరిన్ ధర్మాలు, ఉపయోగాలు, హైడ్రోజన్ క్లోరైడ్ M.

బోధన పద్ధతులు

  1. విజ్ఞానశాస్త్ర స్వభావం, పరిధి
  2. విజ్ఞానశాస్త్ర ఉద్దేశాలు, విలువలు మరియు బోధన లక్ష్యాలు
  3. ఇతర పాఠ్య విభాగాలతో విజ్ఞాన శాస్త్రానికి ఉన్న సంబంధం
  1. వ్యవస్థీకృత వనరులు బోధనాభ్యాసన సామాగ్రి వనరుల వినియోగం
  2. పాఠ్య ప్రణాళిక అమలు విధానం
  3. మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం

ఆంధ్రప్రదేశ్ TRT (SGT) – ALL SUBJECTS TEST SERIES CLICK HERE

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *